What is the Artificial Intelligence? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి?

 








ఈ మధ్య మనకి చాలా frequent గా వినిపిస్తున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనినే షార్ట్-కట్ లో AI అని,  తెలుగులో కృత్రిమ మేధ అని అంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలామంది మానవాళి చరిత్రలోనే ఒక గొప్ప ఆవిష్కరణగా భావిస్తుంటే, కొందరు మాత్రం హద్దులులేని, ఇంకా  మానవ నియంత్రణ తక్కువగా ఉండే ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం మానవాళికే ముప్పుగా మారచ్చని తమ ఆందోళనలను వ్యక్తపరుస్తున్నారు. 

అసలు ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి చర్చకి కారణమైన ఈ Artificial Intelligence ఎంటే ఏంటి?  దాని ప్రభావాలు సమాజంపై ఎలా ఉండబోతున్నాయి? వరమా లేక శాపమా? అన్న విషయాలు మనం ఇప్పుడు చూద్దాం.

కొన్ని నెలల క్రితం  Artificial Intelligence ని base చేసుకుని, Open AI సంస్థవారు ఆవిష్కరించిన ChatGPT అనే software ని చూసి, దాని పనితనాన్ని, ప్రభావాన్ని అర్ధంచేసుకున్న సాధారణ ప్రజలనుండి, సెలబ్రిటీలవరకూ అందరూ సంభమాశ్చర్యాలకి లోనయ్యారు. Experts ఏ రాశారా అనేంత కచ్చితత్వంతో చాలా ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం, సమస్యలకి సొల్యూషన్స్ చెప్పడం దీని ప్రత్యేకత.  ఇప్పటివరకూ మనకి ఏదైన information కావాలంటే  ఇంటర్నెట్ లోకి వెళ్ళి, గూగుల్, yahoo, బింగ్ వంటి సెర్చ్ ఇంజన్లలో వెతకడం మనకి అలవాటు. 

అయితే ఈ సెర్చ్ ఇంజన్లు, వివిధ వెబ్ సైట్లలో ఉన్న సమాచారాన్ని, కొన్ని ప్రత్యేక కీవర్డ్స్ తో మాచ్ చేసుకుని, మనకి చూపిస్తాయి. అయితే  Chat GPT వంటి AI అధారిత   సర్వీసులు మనం అడిగిన ప్రశ్నకి సంబందించి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉండే సమాచారాన్ని సొంతంగా సేకరించి, దానికి తన సొంత అలోచనలను కలిపి సమాధానం చెబుతాయి.  మనం అడిగిన ప్రశ్నలకి సంబంధించిన సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేక సహాయాలు చెయ్యడం, అంటే సొంతంగా పాటలు రాయడం, టెకీలకి అవసరమైన software code చకచకా  రాసేయడం వంటి పనులు కూడా చాలా easy గా చేసేస్తూ ChatGPT అందరినీ  ఆశ్చర్యపరుస్తోంది. అక్కడక్కడా చిన్న పొరపాట్లు దొర్లుతున్నాయన్నది నిజమే కానీ future లో  అది ఖచ్చితంగా మరింత మెరుగ్గా మారుతుందని చాలామంది  నమ్ముతున్నారు. 

అతిత్వరలో గూగుల్ ను కూడా దెబ్బతీసే సామర్ధ్యం ChatGPTకి ఉందని  జీమెయిల్ ఫౌండర్ పాల్ బచీట్ కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.

మరోవైపు చూస్తే  AI ని ఆధారంగా చేసుకుని develop చేసిన Deepfake అనే technology ని  ఉపయోగించి మనందరికీ సుపరిచితమైన ఒక heroin మొహాన్ని ,మరొకవ్యక్తి శరీరానికి  కలిపి వికృతంగా చూపించిన వీడియో ఒకటి సమాజంలో భయాందోళనలు కలుగజేసింది. సాక్షాత్తూ దేశ ప్రధాని, హోం మంత్రి స్పందించాల్సినంత అలజడిని రేకెత్తించింది. ఈ పరిణామం AI భవిషత్తులో ప్రపంచం మీద ఎలాంటి  ప్రభావాన్ని కలుగజేస్తుందో అన్న గుబులు ప్రతి మనిషి మెదడులో మొదలయ్యేలా చేసింది. అసలు Artificial Intelligence  అనేది మానవాళికి వరమా లేక శాపమా అన్న విషయంలో ఇంకా పూర్తి క్లారిఫికేషన్ దాని రూపకర్తలలో కూడా కనిపించట్లేదు అనిపిస్తూంది. అనేక దేశాల ప్రభుత్వాలు కూడా ఈ టెక్నాలజీ వైపు ఒకింత భయం భయం గానే చూస్తున్నాయి. ChatGPT రూపకర్త, OpenAI Co-founder ప్రస్తుత CEO అయిన సామ్ ఆల్ట్మాన్ కూడా ఏఐ కలిగించే పరిణామాలపై తన భయాలను బహిరంగంగా వ్యక్తపరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ "మానవులకు వ్యతిరేకంగా ప్రాణాంతకమైన ఆయుధంగా మారుతుందని" ఆల్ట్ మాన్ కూడా భయం వ్యక్తం చేశారు. "మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను బానిసగా చేసేసుకోవాలి లేదా అది మనల్ని బానిసలుగా చేసుకుంటుంది" అని ఆయన స్పష్టంచేశారు.  "ఇటువంటి టెక్నాలజీని సమాజంలోకి ప్రవేశపెట్టడానికి అత్యంత బాధ్యతాయుతమైన మార్గం లో మాత్రమే మనం ప్రయాణించాలని మేము నిజంగా విశ్వసిస్తున్నాం" అనికూడా కొన్ని టెక్-పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆల్ట్ మాన్ పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ లో దీని గురించి ప్రస్తావన వచ్చింది. ఈ ఏడాది మే నెలలో ఆల్ట్మాన్ అక్కడ తన వాంగ్మూలాన్ని సమర్పించారు.సెనెట్ ప్రైవసీ అండ్ టెక్నాలజీ కమిటీ ముందు హాజరైన ఆల్ట్ మాన్ ని "చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది? ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు ఏంటి?"  అని కమిటీ ప్రశ్నించింది. అనేకదేశాల పార్లమెంటుల్లో కూడా ఈ టెక్నాలజీ గురించి చర్చలు నడుస్తున్నాయి.

ఇప్పుడు మనం Artificial Intelligence ప్రభావం సమాజంపై ఎలా ఉండవచ్చు అన్నది చూద్దాం? 

ఒక శక్తివంతమైన టెక్నాలజీ మార్కెట్లోకి కొత్తగా రిలీజ్ అయినప్పుడు, సమాజంలో రకరకాల రీతుల్లో చర్చలకి కారణంగా నిలుస్తూ ఉంటుంది. Computers, Mobile phones, bluetooth technology వంటివాటిని దీనికి   ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.   90వ దశకంలో కంప్యూటర్లు మనదేశంలోకి ప్రవేశిస్తున్న కాలంలో, సమాజంలో ఒక విధమైన భయంతో కూడిన చర్చలు నడుస్తూ ఉండేవి. పదిమంది కలిపి పదిరోజుల్లో చేసేపనిని, ఒక కంప్యూటర్ ని ఉపయోగించి, ఒకే మనిషి ఒకే రోజులో చేయ్యగలడని, దానివల్ల చాలా ఉద్యోగాలు  పోయి దేశంలో నిరుద్యోగరేటు భారీగా పెరిగిపోతుందని చర్చలు జరిగేవి. అయితే  తర్వాతిరోజుల్లో చూస్తే కంప్యూటరైజేషన్ వల్ల భయపడినంత నష్టం ఏమీ జరగలేదు. కొన్ని రంగాల్లో ఉద్యోగాలు తగ్గినా, దాని ప్రభావం ఏమాత్రం కనిపించనీయకుండా కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. అప్పటి యువతకి, ఇంకా మధ్యవయస్కులకి కూడా కంప్యూటర్ బాగానే పట్టుపడింది.  కాలక్రమంలో కంప్యూటర్ అనేది మన జీవితంలో భాగం అయిపోయింది. ఒక్క software రంగమే కాకుండా, బ్యాంకింగ్, మెడికల్, ఇన్సూరెన్స్ ఇలా ప్రతీ రంగం IT ని అందిపుచ్చుకోవడంతో, సరికొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు కంప్యూటరైజేషన్ వద్దంటూ ఆందోళనలు చేసినవారే, తమ పిల్లలకి సోఫ్ట్-వేర్ కోర్సులు నేర్పించి IT jobs లోకి పెట్టారు. తమ  కూతుళ్ళకి software అబ్బాయిలనే ఇచ్చి పెళ్ళిచెయ్యాలని తహతహలాడారు. సాధారణ వ్యక్తుల ఆర్ధిక స్థితిలో గణనీయమైన మార్పును తీసుకుని వచ్చింది IT. అయితే ఎక్కువగా బయట దేశాల నుండీ వచ్చే వర్క్ మీద ఆధారపడిన రంగం కనుక, అప్పుడప్పుడూ కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా,తట్టుకుని నిలబడి ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్న రంగంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ మధ్యతరగతి ప్రజల జీవనవిధానాన్నే మార్చివేసిన రంగంగా software రంగం రూపుదిద్దుకుంది.

ఒకప్పుడు సమాచారాన్ని, పేపర్లమీద రాసి maintain చేస్తే, computer రాకతో సరికొత్త software లను అభివృద్ధి చేసి, వాటి సాయంతో మరింత secured గా maintain చెయ్యడం మొదలుపెట్టారు. ఇలా సమాచారాన్ని maintain చెయ్యడానికి అవసమైన software లను develop చెయ్యడానికి, కంపెనీలు    భారీగా software engineer లను appoint చేసుకుంటాయి. అయితే, ఇప్పుడు AI రాకతో ఈ software employees place ని machines ఆక్రమించుకుంటాయేమో అన్న అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. ప్రస్తుతానికి అది అనుమానమే అయినా, futurre లో అది నిజమయ్యే అవకాశం ఉందని కొంతమది analystల అంచనా. అయితే, కొన్ని ఉద్యోగాలు AI బారిన పడినా, సరికొత్త అవకాశాలకి తలుపులు ఖచ్చితంగా తెరుచుకుంటాయని భరోసా కూడా ఉంది.  దీనికి ఉదాహరణ కూడా IT రంగమే. ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఏంటో కూడా సాధారణ ప్రజలకి అవగాహన లేని కాలంలో, టెక్నికల్ గా వస్తున్న మార్పులకి మొదట్లో భయపడినా, తర్వాతికాలంలో ఆ మార్పును అతి సాధారణ ప్రజలు కూడా అందిపుచ్చుకున్నారు. ఈరోజున చూసుకుంటే, శుభకార్యాలకి శుభలేఖలు తయారు చెయ్యడం దగ్గరనుండి,  పుస్తకాల ప్రింటింగ్, ఇళ్ళకి వేసే రంగులు, ఆన్లైన్ లో జాతకాలు చెప్పడం అన్నీ కూడా computerized గా మారిపోయాయి. ఇప్పుడు ఇటువంటి పనులు మాన్యువల్ గా చేసేవారు నూటికి 1% కూడా ఉండరు. ఇవన్నీ గత రెండు దశబ్దాలలో వచ్చిన మార్పులు.   అలాగే AI వాడకం   పెరుగుతున్నకొద్దీ సరికొత్త అవకాశాలకి దారులు ఖచ్చితంగా దొరుకుతాయి. దానికోసం మనం చెయ్యవలసింది, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన skills తో తయారుగా ఉండడమే.  కొందరు నిపుణులు సూచిస్తున్న ప్రకారం AI, Datascience, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్,   క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటిపై దృష్టిపెట్టగలిగితే కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

అసలు ప్రపంచవ్యాప్తంగా ఇంత చర్చలకి కారణం అవుతున్న AI అంటే ఏంటి? అన్న విషయం ఇప్పుడు మనం చూద్దాం.  

మనం రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాం. రెడ్ సిగ్నల్ పడింది.ఆగుతాం. ఎందుకు ఆగుతాం? రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా మొండిగా road cross చెయ్యడానికి try చేస్తే, accident జరిగే అవకాశం ఉంది. So, మన బ్రైన్ మనకి ఆగమని signalఇస్తుంది.  అసలు మన బ్రైన్ కి  ఇక్కడ ఆగాలని ఎలా తెలిసింది? సింపుల్. చిన్నప్పటినుండి మనం నేర్చుకున్న పాఠాలలోనో, ఇంకా పరిసరాలను గమనించో ఆ జ్ఞానం వచ్చింది. ఏ వీధిలో రెడ్ సిగ్నల్ పడినా,  బ్రైన్ మనకి అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఆగుతాం. అంటే ఇక్కడ హ్యూమన్ ఇంటిలిజెన్స్ శరీరాన్ని నియంత్రిస్తోంది. ఈ హ్యూమన్ ఇంటిలిజెన్స్ ని మనకి ఇచ్చింది ఎవరు? అంటే ప్రకృతి/దేవుడు ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఈ HI లో విచక్షణ ఉంటుంది. అంటే అవసరమైన చోట పూర్తిగా ఆగడం, నెమ్మదిగా లెకపోతే పక్కనుండి వెళ్ళడం ఇవన్నీ విచక్షణతోనే మనం చేస్తాం. 

కారులో వెళ్తున్నాం, రెడ్ సిగ్నల్ పడింది. బ్రేక్ వేస్తాం.కారు ఆగుతుంది. ఇక్కడ కూడా కారు అనబడే ఒక మిషీన్ ని మన బ్రైన్ నియంత్రిస్తోంది. కారుకు వేగంగా ముందుకు వెళ్ళే సామర్ధ్యం ఉంది, ఎంతదూరమైన ప్రయాణించగల శక్తి ఉంది. కానీ ఎక్కడ స్లో అవ్వాలి, ఏవీధిలోకి తిరగాలి, ఎక్కడ ఆగాలి అనే వాటిని స్వతంత్రంగా నిర్ణయించుకోగల సామర్ధం ఉండదు. ఆ సామర్ధ్యం మనిషికే ఉంటుంది. మనిషి బ్రేక్ వెయ్యడం ద్వారా ఇక్కడ కార్ ఆగాలి అని నిర్ణయం తీసుకున్నాదు కనుక ఆగింది. ఇక్కడ కారుని నియంత్రిస్తోంది కూడా హ్యూమన్ ఇంటిలిజెన్స్ ఏ .  అంటే మనిషి ఏకకాలంలో కారుమీదా, ఇంకా బయట పరిసరాలమీదా కూడా నియంత్రణ కలిగి ఉండాలి. లేక పోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కారుకే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలిగే శక్తి ఉండాలంటే ఏంచెయ్యాలి? సింపుల్... మనిషికి ఉండే ఇంటిలిజెన్స్ నే కారుకి కూడా ఉండేలా చెయ్యగలిగితే చాలు. అలా ఉండాలంటే ఏంచెయ్యాలి అనే ఆలోచన నుండి వచ్చిందే  Artificial Intelligence. 

నిజానికి ఈ Artificial Intelligence అనే భావన కొత్తది కాదు. సాధారణ ప్రజల ఊహల్లో, అన్ని భాషలలోని సాహిత్యంలో ఎప్పటినుండో ఉంది. ఇంకా చెప్పాలంటే ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా మొదట ఊహల్లోనే మొదలవుతుంది.  పక్షిలా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలనే మనిషి ఊహ నుండే కదా విమానాలు పుట్టుకొచ్చింది.   ఈరోజు రాకెట్లు ఎగరడం, శాటిలైట్లు భూమిచుటూ తిరగడం, మనుషులు space walk చెయ్యడం సాధారణ విషయాలు. కానీ  వీటిగురిచి ఊహలు, ఆలోచనలు కొన్ని శతాబ్దాలకి ముందే ఉన్నాయి. ఆధునిక విజ్ఞానశాస్త్ర పితామహుడిగా పేర్కొనే గెలీలియో. అంతరిక్షంపై పరిశోధనలు చేస్తూ "ఆకాశంలో ఎగురుతూ, అంతరిక్షంలోకి ప్రవేశించగల సామర్ధ్యం ఉన్న వ్యోమనౌకలను ఎవరైనా తయారుచేస్తే, వాటిలో ప్రయాణిస్తూ రోదశిలోకి ప్రవేశించడానికి అనేకమంది సిద్ధంగా ఉన్నారని" 15వ శతాబ్ధంలోనే పేర్కొన్నాడు.   కానీ ఆ ఊహ  నిజం కావడానికి 4 శతాబ్దాలకి పైగా పట్టింది. కాని నిజమయ్యింది. 

అలాగే AI ని 1950 లలోనే ప్రతిపాదించారు. అయితే, అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రాధమిక దశలోనే ఉండడం వల్లా, ఇంకా ఇటువంటి critical technology అనేది కాలక్రమంలో అభివృద్ధి చెందవలసినదే కానీ ఒక్క రోజులో జరిగేది కాదు కనుక దానికి ఒక shape and texture  రావడానికి ఇంతకాలం పట్టింది.   సరదా విషయం ఏంటంటే, నిజమైన Artificial Intelligence మనకి చేరువకావడానికి ఇంతకాలం పట్టినా, sciexnce fiction నవలల్లో, రచనల్లో మాత్రం ఇది సాధారణ ప్రజలకి ఎప్పుడో చేరువ ఐపోయింది.  తెలుగులో కూడా మైనంపాటి భాస్కర్ అనే రచయిత 1985 లో రాసిన "బుద్ధిజీవి" నవలలో,  తనను తయారు చేసిన యజమానికే ఎదురుతిరిగి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ, గందరగోళం సృష్టించే రోబో కథ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ దర్శకుడు "శంకర్" తీసిన విజువల్ వండర్ రోబో కథ కూడా దాదాపుగా ఇలాగే ఉండడంతో కాపీ ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే, శాస్త్రవేత్తల, రచయితల ఆలోచనలు ఎప్పుడూ చాలా ఎడ్వాన్సుడ్ గానే ఉంటాయి, కాకపోతే అవన్నీ నిజజీవితంలో జరిగి, సాధారణ ప్రజలకి అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది.

So, వీటన్నిటిద్వారా మనకర్ధమయ్యేది ఒక్కటే, AI అంటే ఒక machine అవసరం వచ్చినప్పుడు ఎవరిమీదా ఆధారపడకుండా తనంతట తానే నిర్ణయం తీసుకోవడం. అయితే ఇక్కడ "ఎవరిమీదా ఆధారపడకుండా" అనడమే ఆసక్తినీ అదే సమయంలో ఆందోళననీ కూడా కలిగిస్తోంది.  హ్యాకింగ్ లాంటి సంఘటనలు జరిగితేనే మనం గజగజ వణికిపోయే స్థితిలో ఉన్నాం. అలాంటిది, ఒక మెషీన్ కి స్వంత ఇంటిలిజెన్స్ వచ్చి, అది మనజీవితాలను తన చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి ఏంటి అనే చర్చలు జరుగుతున్నాయి. అలా జరిగే అవకాశము ఉందా అంటూ ఆరాతీస్తున్నారు. అసలిది మనకి వరమా శాపమా అని చర్చలు చేస్తున్నారు. అసలు ఒక మిషన్ మొత్తం కంట్రోల్ తన చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుందా అంటే, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం "ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ "ఆ లెవెల్ కి ఇంకా చేరుకోలేదు. చేరుకున్నా సాధారణ ప్రజలకి దాని రిజల్ట్స్ చేరుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. అయితే AI వాడకంపై అన్నిదేశాల ప్రభుత్వాలు సమన్వయంతో కొన్ని నియమాలు రూపొందించాలి. ఇప్పటికే చాలా దేశాలు ఈ విషయంలో విధి విధానాలు, కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నాయి. కనుక ఈ విషయంలో మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ విషయాలు ప్రభుత్వాలు చూసుకుంటాయి.


అదేసమయంలో చాలామంది కంగారుపడే విషయం "ఉద్యోగాలు". AI వల్ల చాలా ఉద్యోగాలు పోతాయని అందరూ ఖంగారు పడిపోతున్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే మనుషుల స్థానంలో AI ఆధారిత రోబోట్స్ వినియోగిస్తున్నాయని, దానివల్ల వాటికి ఖర్చులు ఎంతో ఆదా అవుతున్నాయని వర్తలు వస్తున్నాయి. అది కొంతవరకూ ఆందోళన కలిగించే అంశమే అయినా, పూర్తిగా మనుషులు లేకుండా ఏ కంపెనీ వర్క్ చెయ్యలేదు.  అయితే కొన్ని రకాల ఉద్యోగాలు కుదుపులకి లోనయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి కస్టమర్ కేర్ సెంటర్లలో మనుషుల బదులు, AI ఆధరిత చాట్-బోట్ లను వినియోగించవచ్చు. అయితే అదేసమయంలో, కొత్త స్కిల్స్ ని అందిపుచ్చుకున్నవారికి మాత్రం కొత్త కొత్త ఉద్యోగాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు, మనదేశంలోకి కంప్యూటర్లు వచ్చిన కొత్తల్లో కొన్ని రకాల ఉద్యోగాలు పూర్తిగా మర్పుకి గురయ్యాయి. ఉదాహరణకి, అప్పటి వరకూ పేపర్ వర్క్ మీదే ఆధారపడిన క్లర్క్ వంటి వాటి స్థానంలో కంప్యూటరైజేషన్ జరిగింది. కొత్తమార్పుని అందిపుచ్చుకున్నవారికి ఉద్యోగాలు నిలపడ్డాయి, లేనివారు ఇబ్బందులు పడ్డారు. కానీ మార్పు మాత్రం ఆగలేదు. అలాగే AI కూడా. మారుతున్న టెక్నాలజీని చూసి మనం భయపడకూడదు. దానిని మనం ఆపలేము. మనం చెయ్యవలసింది, కొత్త దారుల్ని వెతకడమే.

0 Comments:

Post a Comment